‘నిరుపేద విద్యార్థులమైనా.. మా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎంతో కష్టపడి చదువుకుంటున్నం. మేమున్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా రోజూ ఖమ్మం కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నం. ఇప్పుడు పరీక్షల సమయం. మా మాదిరిగా నివసించే కుటుంబాలకు నోటీసులు ఇవ్వకుండా పోలీసులతో వచ్చి తెల్లవారుజామునే ఇండ్లు కూల్చివేయడం ఏమిటో అర్థం కావడంలేదు.
ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షలు రాయకపోతే విద్యాసంవత్సరం కోల్పోతాం. మా గుడిసెలు కలెక్టరేట్ దగ్గరే ఉన్నా రోడ్లు, విద్యుత్తు, తాగునీటి సౌకర్యాలు కల్పించలేదు. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇండ్లను ప్రభుత్వం కూల్చివేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?’ అంటూ ఓ విద్యార్థిని విలపిస్తూ కేటీఆర్కు తన గోడు విన్పించింది.