ఖమ్మం ఆర్డీవోపై బదిలీ వేటు
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు, ఇండ్లను తొలగించడంలో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నర్సింహారావుపై సర్కార్ బదిలీ వేటువేసింది.
- భూదాన్ భూముల అంశంలో అధికారి బలి
- త్వరలో తహసీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం
ఖమ్మం, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు, ఇండ్లను తొలగించడంలో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నర్సింహారావుపై సర్కార్ బదిలీ వేటువేసింది. భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని నివాసం ఉన్నవారికి పట్టాలు ఉన్నా ఎలా కూల్చివేస్తారని బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. ఇండ్ల కూల్చివేతతో నిరాశ్రయబాధితులను పరామర్శించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం రావడంతో ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
దీంతో విషయ తీవ్రతను తగ్గించడానికి ఆర్డీవో నర్సింహారావును జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్డీవోగా ఆకస్మికంగా బదిలీచేసింది. అక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్‌ను ఖమ్మం ఆర్డీవోగా నియమించారు. భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో తప్పు తమది కాదు.. అధికారులదే అనే భావన ప్రజల్లో కల్పించడానికే ప్రభుత్వ పెద్దలు ఆయనను సాగనంపినట్టు భూదాన్ బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించే ప్రక్రియను నర్సింహారావు ఆర్డీవో హోదాలో పర్యవేక్షించారు. గుడిసెల తొలగింపును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన తహసీల్దార్‌పై ఒకటి రెండు రోజుల్లో బదిలీవేటు పడనున్నట్టు ప్రచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

