Jurassic World Rebirth OTT |హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో వచ్చేసింది. అయితే ప్రస్తుతం అమెరికాలో వీడియో ఆన్ డిమాండ్ (VOD) పద్ధతిలో మాత్రమే ఈ చిత్రం తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళం తదితర భాషల్లో అందుబాటులో ఉంది. ఇండియాలో ఈ చిత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఈ చిత్రాన్ని ఇండియాలో కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహెర్షలా అలీ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2022లో వచ్చిన ‘జురాసిక్ వరల్డ్: డొమినియన్’ తర్వాత జరిగే కథ. ఒక ఐలాండ్లో డ్రాగన్ల డీఎన్ఏ నుంచి మందును తయారు చేయడానికి వెళ్ళిన ఒక బృందం ఎదుర్కొనే సవాళ్లే ఈ సినిమా కథాంశం.