Megastar Chiranjeevi | సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌పై తాను స్పందించనని తెలిపాడు అగ్రనటుడు చిరంజీవి. ఫీనిక్స్ ఫౌండేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు నటుడు చిరంజీవి, తేజ సజ్జా. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన ఒక జర్నలిస్ట్ వలన వచ్చిందని ఈ విషయంలో అతడికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చిరంజీవి అన్నారు.
ఈ కార్యక్రమంకి వచ్చి బ్లడ్ డోనేట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా బిడ్డ లాంటి తేజసజ్జాకు కూడా బ్లడ్ డోనేట్ చేసినందుకు ధన్యవాదాలు. రక్తదానం పేరు చెప్పగానే నేను గుర్తొస్తున్నానంటే అది నా పూర్వజన్మ పుణ్యం. ఈ సందర్భంగా ఒక విషయం మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఎవరో ఒకరు రాజకీయ నాయకుడు కారణం లేకుండా నన్ను విమర్శించడం మొదలుపెట్టాడు. నేను ఇప్పుడూ రాజకీయల్లో కూడా లేను. అయిన కూడా అప్పుడప్పుడు విమర్శలు వస్తునే ఉంటాయి. అయితే ఈ నాయకుడు ఒకరోజు ఎదో ముంపు ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ ఒక మహిళ అతడిని నిలదీస్తూ.. చిరంజీవిని అలాంటి మాటాలు అనాలని మీకు ఎందుకు అనిపించిందంటూ కడిగి పారేసింది. దీంతో ఆ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాను. ఆ తర్వాత ఆమె వివరాలు తెలుసుకోగా.. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని అందుకే నేనంటే ఆమెకు గౌరవమని తెలిసి నాకు గుండె ఉప్పొగింది.
అయితే సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై నేను ఎందుకు స్పందించరంటూ అందరూ నన్ను అడుగుతారు. నేను ఎప్పుడూ స్పందించను. నేను చేసే మంచి పనులు నాపై అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచాలు. విమర్శలపై నేను స్పందించాల్సిన పనిలేదు. నా మంచితనమే మాట్లాడుతుందంటూ చిరంజీవి చెప్పుకోచ్చాడు.