Youtuber | యూట్యూబ్ వీడియో కోసం రిస్క్.. ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు
Youtuber | ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎంతగానో పెరిగిపోతోంది. ఫేమస్ కావాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకరమైన రీతిలో రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Youtuber | ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎంతగానో పెరిగిపోతోంది. ఫేమస్ కావాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకరమైన రీతిలో రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో తీయాలని ప్రయత్నించి ప్రమాదంలో చిక్కుకున్న ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన సాగర్ తుడు అనే యువ యూట్యూబర్ తన స్నేహితులతో కలిసి కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. ప్రకృతి అందాలు చూసిన సాగర్ వాటిని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేయాలని భావించాడు.
అంతటితో ఆగకుండా, మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు జలపాతానికి సమీపంలోని నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు వీడియో చిత్రీకరణలో ఉన్నారు. కానీ అనుకోని ఘటన ఒక్కసారిగా జరిగిపోయింది. సాగర్ నీటిలో ఉన్న సమయంలో ఊహించని విధంగా జలపాతంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. బయటకు రావాలని అనుకున్న అతను ప్రవాహానికి కొట్టుకొని పోయాడు. అతన్ని కాపాడేందుకు స్నేహితులు చాలా ప్రయత్నించినా, రక్షించలేకపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సాగర్‌ను గల్లంతైనట్టు గుర్తించిన పోలీసులు మరియు రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని శోధన చర్యలు ప్రారంభించాయి. కాగా, ఈ ప్రమాదం జరిగిన దృశ్యాలు అక్కడే ఉన్న వారు తీసిన వీడియోల ద్వారా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇలాంటి సంఘటనలు యువతను ఆలోచనలో పడేసేలా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో పాపులర్ కావాలనే ఆశతో ప్రాణాలను పణంగా పెట్టడం ఆందోళనకరమైన విషయం. అప్రమత్తత లేకుండా తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు పెద్ద ప్రమాదాలకు దారితీయొచ్చు. పాపులారిటీ కన్నా ప్రాణం ముఖ్యం. సాహసాలు చేయోచ్చు కాని , అది జీవితాన్ని ముగించే స్థాయికి వెళ్లకూడదు. యువతరం ఇటువంటి చర్యలపట్ల జాగ్రత్తగా ఉండాలి. సురక్షితంగా ఉండటం కూడా ఒక విజయం అని గుర్తించాలి.
The video is reportedly from Koraput, where a YouTuber was swept away by strong currents at Duduma Waterfall.
People must exercise extreme caution while filming and never put their lives at risk.
Such a tragic incident. pic.twitter.com/8hHemeWv2e
— Manas Muduli (@manas_muduli) August 24, 2025
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

