e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News మమతాజీ వారణాసి రండి.. స్వాగతం: మోదీ

మమతాజీ వారణాసి రండి.. స్వాగతం: మోదీ

మమతాజీ వారణాసి రండి.. స్వాగతం: మోదీ

కోల్‌కతా: బయటి వ్యక్తి అంటూ ప్రధాని మోదీపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. బయటివ్యక్తులు అంటూ వ్యాఖ్యానిస్తూ టీఎంసీ నేతలు నేతాజీని అవమానపరుస్తున్నారని మోదీ దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్య భారతదేశంలో ఇక్కడి పౌరులెవ్వరూ బయటి వ్యక్తులు కారని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా తన నియోజకవర్గమైన వారణాసికి మమతా బెనర్జీని ఆహ్వానించారు. అయితే, అక్కడ రామభక్తులు అడుగడుగునా కనిపిస్తారని, అప్పుడేం చేస్తారంటూ చురకలంటించారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అభద్రత కారణంగా నందిగ్రామ్ సీటు నుంచి కాకుండా మరో సీటు నుంచి పోరాడేందుకు మమతా బెనర్జీ సిద్ధమయ్యారని ప్రధాని మోదీ చేసిన విమర్శలపై.. మమతా బెనర్జీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తారని తృణమూల్ కాంగ్రెస్‌ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు.

‘దీదీ ఇప్పుడు బయట స్థలం కోసం చూస్తున్నారు. వారణాసికి స్వాగతం. హల్దియా నుంచి వారణాసికి వెళ్ళే ఓడ ఉంటుంది. మరో విషయం, బెనారస్‌ ప్రజలు చాలా సహృదయంతో ఉన్నారు. వారు మిమ్మల్ని పర్యాటకులని లేదా బయటి వ్యక్తి అని పిలువరు. వారు బెంగాల్ ప్రజల మాదిరిగానే పెద్ద మనుసుతో ఉన్నారు. అయితే, వారణాసిలో జై శ్రీ రామ్ అని చెప్పే చాలా మంది ఎదురవుతుంటారు. అప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసా? మీకు ఎవరిపై కోపం వస్తుందో తెలుసా? బెనారస్ ప్రజలపై కోపగించవద్దు. వారు మీతో కలిసి నివసిస్తారు. కాని వారు మిమ్మల్ని ఢిల్లీకి వెళ్లనివ్వరు. వారు మిమ్మల్ని అక్కడే ఉంచుకుంటారు’ అని నరేంద్ర మోదీ జై శ్రీరాం అని పెద్ద ఎత్తున నినాదాలు చేయిస్తూ బహిరంగ సభలో చెప్పడం అక్కడికి వచ్చిన వారిని విశేషంగా ఆకర్శించింది. మోదీ ప్రసంగం చేస్తున్నంత సేపు అక్కడ గుమిగూడిన కార్యకర్తలు జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

ఇస్రో శాస్త్రవేత్తకు వేధింపులు..? సుప్రీంకోర్టుకు దర్యాప్తు ప్యానెల్‌ నివేదిక

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టీడీఎస్‌.. ఎలా నివారించుకోవాలంటే..?

ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్‌ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?

డ్రైవింగ్‌ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ

ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్‌ఖాన్‌

లైవ్‌లో రిపోర్టర్‌ మైక్రోఫోన్‌ ఎత్తుకెళ్లిన కుక్క

లాక్‌డౌన్‌ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి

అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

షోఫియాన్‌లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం

ఆర్మీ బలోపేతం వెనుక జనరల్‌ మానెక్‌షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మమతాజీ వారణాసి రండి.. స్వాగతం: మోదీ

ట్రెండింగ్‌

Advertisement