Sriram Krishnan | డొనాల్డ్ ట్రంప్ టీమ్ నుంచి వైదొలగనున్న భారత సంతతి అధికారి
Sriram Krishnan | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సీనియర్ సలహాదారుగా పనిచేసిన భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ (Sriram Krishnan) తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నెలాఖరులో టెక్నాలజీ సలహాదారు పదవి నుంచి దిగిపోనున్నట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో అమెరికా ఏఐ (AI) విధానాలను రూపొందించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
Sriram Krishnan : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సీనియర్ సలహాదారుగా పనిచేసిన భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ (Sriram Krishnan) తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నెలాఖరులో టెక్నాలజీ సలహాదారు పదవి నుంచి దిగిపోనున్నట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో అమెరికా ఏఐ (AI) విధానాలను రూపొందించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ట్రంప్‌తో కలిసి పని చేయడం తనకు లభించిన గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఏఐ పోటీని తట్టుకొని దేశం ముందుకు వెళ్లడానికి అధ్యక్షుడు కీలక చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు.
ట్రంప్ నాయకత్వం లేకుండా అమెరికా ఏఐ రేసులో ముందంజలో ఉండేది కాదన్నారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అమెరికా అభివృద్ధి కోసం పని చేశానని శ్రీరామ్ కృష్ణన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారుగా తాను అమెరికన్ ఏఐ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించి, ప్రచురించడంలో సహాయపడ్డానని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం నేషనల్ ఏఐ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై పనిచేసినట్లు తెలిపారు. ఫ్రాన్స్, భారత్ వంటి దేశాలలో జరిగిన అంతర్జాతీయ ఫోరమ్‌లు, సదస్సులలో అమెరికన్ ఏఐ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించానని పేర్కొన్నారు.
కొంత విరామం తర్వాత ఏఐ విషయంలో అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న భారీ సవాళ్లను అధిగమించడానికి సాయం చేస్తానని తెలిపారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్‌ను నియమించారు. అంతకుముందు వెంచర్ క్యాపిటలిస్ట్‌గా వ్యవహరించిన ఆయన అమెరికాలో కృత్రిమ మేధస్సు విధానాలు, జాతీయ ఫ్రేమ్‌వర్క్ రూపకల్పనలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఎక్స్ వంటి టెక్ సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

