Varun Tej | ‘పెద్ది’ సినిమాపై వరుణ్ తేజ్ ప్రశంసల వర్షం.. చరణ్ అన్నా నీ నటన ఒక మాస్టర్ క్లాస్ అంటూ ట్వీట్!
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
RamCharan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాను చూసి సోషల్ మీడియా ద్వారా తన రివ్యూను పంచుకుంటూ చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రతి సినిమా మన మనసుకు హత్తుకోదని, కానీ ‘పెద్ది’ సినిమా తనను మానసికంగా ఎంతో కదిలించిందని వరుణ్ తేజ్ పేర్కొన్నారు. జీవితం మనపై ఎలాంటి సవాళ్లు విసిరినా, మనం ఎంత ఘోరంగా కిందపడినా, మళ్లీ తిరిగి లేచి నిలబడాలనేదే ఈ సినిమా యొక్క అసలైన అంతరార్థమని, ఆ పాయింట్ తనకు బాగా నచ్చిందని చెప్పారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో నమ్మకంతో, ప్రతిభతో ఈ కథను తెరకెక్కించారని కొనియాడిన వరుణ్.. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ ప్రాణం పెట్టి నటించారని అభినందించారు. ముఖ్యంగా సీనియర్ నటులు జగపతిబాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (శివన్న) నటన అద్భుతంగా ఉందన్నారు. ఇక తన అన్న రామ్ చరణ్ నటన గురించి చెబుతూ.. “చరణ్ అన్నా, నీ నటన చూశాక నాకు మాటలు రావడం లేదు. ‘పెద్ది’ పాత్రలోకి నువ్వు పరకాయ ప్రవేశం చేసిన విధానం, ఆ పాత్రను సజీవంగా మార్చి ప్రేక్షకులను అందులో లీనమయ్యేలా చేయడం నిజంగా ఒక మాస్టర్ క్లాస్. నటుడిగా నన్ను మరోసారి ఎంతగానో ఇన్స్పైర్ చేశావు, థాంక్యూ” అంటూ వరుణ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం వరుణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

