జానారెడ్డి ఇప్పుడు గెలిచి ఏం చేస్తడు : మంత్రి తలసాని
సాగర్ ఎన్నికల్లో మంత్రి తలసాని ప్రచారం | నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థి నోమల భగత్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

నల్లగొండ : అధికారంలో ఉన్న రోజుల్లో నియోజకవర్గాన్ని పట్టించుకోని జానారెడ్డి.. ఉప ఎన్నికల్లో గెలిచి ఏం చేస్తారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా పెద్దవూర మండలం తెప్పలమడుగు, లింగంపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా విప్ బాల్క సుమన్, ఎంపీ లింగయ్యయాదవ్‌తో కలిసి తలసాని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర్ నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. నేరుగా అర్హులకే పథకాలు అందజేస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఎన్నికల్లో గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం నాశనమైందని ఆరోపించారు. నిరంతరం ప్రజలతోనే ఉండే విద్యావంతుడు, యువకుడైన భగత్‌ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

భగత్ గెలుపు ఖాయం : బాల్క సుమన్
సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని, కాంగ్రెస్ కథ ముగిసిందని, జానారెడ్డి ఘోర ఓటమి పాలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రచారానికి వస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సాగర్ భూములు ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు ఇచ్చామని చెప్పుకుంటారా? అని అన్నారు. జానారెడ్డి గెలిచి సాధించేది ఏమీ లేదని, అందుకే ప్రజలు డిసైడ్ అయ్యారని, అభివృద్ధికి జై కొడుతూ టీఆర్ఎస్ను గెలిపించాలని నిర్ణయించుకున్నారన్నారు.
భగత్ చేతిలో జానా ఓటమి ఖాయం : బడుగుల
జానారెడ్డికి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. ప్రజలను, కాలువలను ఓట్లు అడుగనంటూ ఓటర్లను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇలాగే బీరాలకు పోయి ఓడిపోయారని, ఇప్పుడు భగత్‌లో చేతిలో ఓటమిపాలు కావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ప్రజలంతా గులాబీ పార్టీకి ఓటేసి గెలిపించాలని, నాన్న నర్సింహయ్యను కోల్పోయిన బాధలో మీ ముందుకు వచ్చానని, తనను మీ బిడ్డగా భావించి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు.

ఇవి కూడా చదవండి..
తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
చెత్త ట్రాక్టర్లో వెంటిలేటర్ల తరలింపు
ఓటుహక్కును వినియోగించుకోండి : ప్రధాని పిలుపు
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 96,982 కొవిడ్ కేసులు
తమిళనాడు పోల్స్ : అభిమానులపై అజిత్ ఆగ్రహం.. సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్..
టోక్యో ఒలింపిక్స్‌కు నార్త్ కొరియా దూరం
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
ఇండోనేషియా వరదలు.. 150 దాటిన మృతుల సంఖ్య
కొవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష
కరోనాపై గూగుల్ డూడుల్ ప్రత్యేక సందేశం
18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇవ్వండి.. ప్రధానిని కోరిన ఐఎంఏ
వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా
నేటి నుంచి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ
బీజేపీ గెలుపు యంత్రం కాదు.. ప్రజల్లో ఒక చైతన్యం: ప్రధాని మోదీ
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో
హల్దీ, గజ్వేల్ కాల్వలోకి కాళేశ్వర జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

