ర్యాంకింగ్ విధానం : న్యూయార్క్ మేయర్ ఎన్నికలో అమలు
మొదటిసారిగా అమెరికాలో ర్యాంకింగ్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికలో ఓటర్లు ర్యాంక్ ఇవ్వడం ద్వారా ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటారు

న్యూయార్క్ : మొదటిసారిగా అమెరికాలో ర్యాంకింగ్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికలో ఓటర్లు ర్యాంక్ ఇవ్వడం ద్వారా ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటారు. ఈ విధానంలో ఓటర్లు ఎవరో ఒక్క అభ్యర్థికి కాకుండా బరిలో నిలిచిన అభ్యర్థులు ర్యాంకులు ఇవ్వడం ద్వారా ఎన్నుకునే వీలు కల్పిస్తున్నారు. తుది అభ్యర్థి ఎంపికలో ఈ ర్యాంకింగ్ విధానం నిర్ణయాత్మకంగా ఉంటుందని రుజువు చేస్తున్నది. మన దేశంలో నోటా మాదిరిగా.. అభ్యర్థులను తిరస్కరించేందుకు ఓటర్లకు వీలు కల్పిస్తున్నారు. అయితే, ఈ ర్యాంకింగ్ విధానాన్ని గజిబిజిగా ఉన్నదంటూ రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది యూఎస్ రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో ర్యాంకింగ్ విధానం అమల్లో ఉన్నది.
మొదటి ప్రాధాన్యం ఓట్లలో ఏ అభ్యర్థికి మెజారిటీ లభించకపోతే.. రన్ ఆఫ్ ద్వారా నిర్ణయం తీసుకుంటారు. రన్ ఆఫ్ అంటే అతి తక్కువ మొదటి ర్యాంకింగ్ ఉన్న అభ్యర్థి ని తొలగించడం. తొలగించిన వారి ఓట్లు సంబంధిత ఓటర్ల రెండవ ఎంపిక ర్యాంకింగ్లో చేర్చుతారు. ఒక అభ్యర్థి మిగిలిన ఓట్ల గరిష్ఠాన్ని పొందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, ఈ వ్యవస్థ సంక్లిష్టంగా ఉందని నిపుణులు అంటున్నారు. ఇది ఓటర్లను మరిన్ని నిర్ణయాలు తీసుకోవడానికి బలవంతం చేస్తుందని, ఫలితంగా చాలా మంది ఓటర్లు ఎక్కువ మంది అభ్యర్థులను ర్యాంక్ చేయరని వారు చెప్తున్నారు.
శాన్ఫ్రాన్సిస్కోలో అసంపూర్ణ ర్యాంకింగ్స్ ద్వారా నిర్ణయం తలక్రిందులైందన్న విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. 2018 శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ ఎన్నిక సందర్భంగా అభ్యర్థి లండన్ బ్రీడ్ 1 శాతం ఓట్లతో గెలుపొందగా.. 9 శాతం ఓటర్లు బ్రీడ్ లేదా రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థి మార్క్ లెనోకు ర్యాంకు ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. దీనివల్ల ఫలితం ఆశించిన తీరుగా ఉండదని వారు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
సోమరిపోతు ఏనుగు.. నవ్వు తెప్పిస్తోంది..! వీడియో వైరల్
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
ఫ్రెంచ్ ఓపెన్ : కరోనాతో డబుల్స్ ఆటగాళ్ళు అవుట్
సైకిల్ సవారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వరల్డ్ సైకిల్ డే
భారత్ నుంచి పాకిస్తాన్ విభజన.. చరిత్రలో ఈరోజు
అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

