Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Crude Oil Price | ముడిచమురు ధరలు (Crude Oil Price) ఇవాళ (మంగళవారం) ఐదు నెలల గరిష్ఠానికి చేరాయి. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర బ్యారెల్‌కు 53 సెంట్లు (0.48 శాతం) పెరిగి 110.08 డాలర్లకు చేరింది. అంతకుముందు సెషన్లో ఇది 110.70 డాలర్లను తాకింది.
Crude Oil Price : ముడిచమురు ధరలు (Crude Oil Price) ఇవాళ (మంగళవారం) ఐదు నెలల గరిష్ఠానికి చేరాయి. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర బ్యారెల్‌కు 53 సెంట్లు (0.48 శాతం) పెరిగి 110.08 డాలర్లకు చేరింది. అంతకుముందు సెషన్లో ఇది 110.70 డాలర్లను తాకింది. మే 20 తర్వాత ఇదే అత్యధిక స్థాయి. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ధర కూడా 45 సెంట్లు (0.46 శాతం) పెరిగి బ్యారెల్‌కు 99 డాలర్లకు చేరుకుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై దాడులు, సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు, హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. యెమెన్‌లో సైనిక శిక్షణ కేంద్రంపై హౌతీ దాడులు, సౌదీ అరేబియాలోని ఇంధన కేంద్రాలు, విమానాశ్రయాలు, సైనిక స్థావరాలపై దాడులు చమురు ధరలకు మరింత ఊతమిచ్చాయి.
ఈ ఏడాది ఇప్పటివరకు బ్రెంట్ ధర దాదాపు 80 శాతం పెరిగింది. అమెరికా-ఇరాన్ మధ్య విస్తరిస్తున్న ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలకు అంతరాయాలు ఏర్పడటంతో ధరలపై ఒత్తిడి పెరిగింది. గడిచిన రెండు వారాల్లో కనీసం 18 నౌకలపై దాడులు జరిగినట్లు నౌకల కదలికలను పర్యవేక్షించే కెప్లర్ సంస్థ వెల్లడించింది. దాంతో చమురు ధరల్లో భద్రతాపరమైన రిస్క్ ప్రీమియం కొనసాగుతున్నది.
అయితే గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులు క్రమంగా పుంజుకుంటున్నాయి. యుద్ధానికి ముందున్న స్థాయిలో ప్రస్తుతం ముడిచమురు సరఫరాలు దాదాపు 80 శాతానికి చేరుకున్నాయని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాక్ ఈ నెలలో రోజుకు 34 లక్షల బ్యారెళ్లకుపైగా ముడి చమురును ఎగుమతి చేసినట్లు ఆ దేశ చమురు మంత్రి తెలిపారు.
దసరా నేపథ్యంలో దేశీయ కమోడిటీ ఎక్స్ఛేంజీల్లో ఈ ఉదయం ట్రేడింగ్ నిలిచిపోయింది. ఎంసీఎక్స్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లావాదేవీలు జరగవు. సాయంత్రం 5 గంటల నుంచి బంగారం, వెండి, ముడి చమురు, ఇతర లోహాల్లో ట్రేడింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో మాత్రం రోజంతా స్టాక్ మార్కెట్ లావాదేవీలు నిలిపివేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

