Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Constipation | చాలామంది ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్యల్లో మలబద్ధకం ఒకటి. తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తినడం, తగినంత నీరు తాగకపోవడం, ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు వంటి అనేక కారణాలవల్ల ఈ సమస్య వస్తుంది. జీర్ణక్రియ నెమ్మదించి, పొట్టంతా బరువుగా అనిపిస్తుంది. అయితే కొన్ని రకాల పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణలు సూచిస్తున్నారు.
Constipation : చాలామంది ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్యల్లో మలబద్ధకం ఒకటి. తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తినడం, తగినంత నీరు తాగకపోవడం, ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు వంటి అనేక కారణాలవల్ల ఈ సమస్య వస్తుంది. జీర్ణక్రియ నెమ్మదించి, పొట్టంతా బరువుగా అనిపిస్తుంది. అయితే కొన్ని రకాల పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణలు సూచిస్తున్నారు. మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే ఆ ఐదు పండ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. కివి పండ్లు
కివీ పండులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దానిలో ఉండే ‘యాక్టినిడిన్’ అనే ప్రత్యేకమైన జీర్ణ ఎంజైమ్, పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణవ్యవస్థ కదలికలను మెరుగుపరుస్తుంది. కివిలో ఉండే అధిక ఫైబర్ మలాన్ని మృదువుగా మార్చి, విసర్జన సులభంగా జరిగేలా చేస్తుంది.
2. బేరి పండ్లు
బేరి పండ్లలో ‘సార్బిటాల్’ అనే చక్కెర పదార్థం ఉంటుంది. ఇది మన ప్రేగులలో పూర్తిగా గ్రహించబడదు. అది ప్రేగులలోని నీటిని పీల్చుకుని మలవిసర్జనను ప్రేరేపిస్తుంది. బేరి పండు తొక్కలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అందుకే దాని పూర్తి ప్రయోజనాలను పొందాలంటే తొక్కతోపాటు తినడం మంచిది.
3. యాపిల్
యాపిల్ తొక్కలో ‘పెక్టిన్’ అనే కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో మలం కదలిక వేగాన్ని పెంచుతుందని పలు అధ్యయనాల్లో రుజువైంది. అలాగే యాపిల్ తొక్కలో కరగని ఫైబర్ కూడా ఉంటుంది. అది మలం పరిమాణాన్ని పెంచి, విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కాబట్టి యాపిల్‌ను పచ్చిగా తొక్కతో సహా తినడంవల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
4. డ్రాగన్ ఫ్రూట్
ఈ పండులో ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రెండూ మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేయడానికి అవసరమైన పోషకాలు. అంతేకాకుండా డ్రాగన్ ఫ్రూట్లో ‘ఒలిగోశాకరైడ్స్’ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి ‘ప్రీబయోటిక్స్’ గా పనిచేసి మన ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగై మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
5. పొప్పడి పండు
బొప్పాయిలో ‘పపైన్’ అనే శక్తిమంతమైన జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తుంది. మలబద్ధకంవల్ల వచ్చే పొట్ట ఉబ్బరాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. రోజూ సుమారు 100 నుంచి 200 గ్రాముల పండిన బొప్పాయి తినడంవల్ల జీర్ణవ్యవస్థ కదలికలు మెరుగై మలం మృదువుగా మారుతుంది.
కాబట్టి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఐదు రకాల పండ్లను మీ రోజువారీ ఆహారంలో కలిపి తీసుకోవడం మంచిది. వీటితోపాటు రోజంతా సరిపడా నీరు తాగడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

