Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Tiger Shroff | నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) పై కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీస్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ హ్యాండ్లర్లు.. బీహార్ (Bihar) లోని బెగుసరాయ్ (Begusarai) కి చెందిన రితిక్ అలియాస్ రోషన్ (Roshan), హర్యానాలోని సోనీపట్‌కు చెందిన రేహాన్ (Rehan), ఫూల్ సింగ్ (Phool singh) అనే యువకులను సోషల్ మీడియాలో సంప్రదించారు.
Tiger Shroff : నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) పై కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీస్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ హ్యాండ్లర్లు.. బీహార్ (Bihar) లోని బెగుసరాయ్ (Begusarai) కి చెందిన రితిక్ అలియాస్ రోషన్ (Roshan), హర్యానాలోని సోనీపట్‌కు చెందిన రేహాన్ (Rehan), ఫూల్ సింగ్ (Phool singh) అనే యువకులను సోషల్ మీడియాలో సంప్రదించారు.
వాళ్లపై గొడవలు, ఆయుధాల స్మగ్లింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించి ఈ పని కోసం ఎంచుకున్నారు. ఆ ముగ్గురికి విదేశాల్లో మంచి ఉద్యోగం, భవిష్యత్ అవసరాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని ఆశచూపారు. అందుకు బాలీవుడ్ నటుడిపై దాడి చేయాలని సూచించారు. కాల్పుల ప్లాన్‌ను అమలు చేయడానికి అడ్వాన్సుగా రూ.50 వేలు ఇచ్చారు. పని ముగించిన తర్వాత మరింత డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు, అమెరికాకు చెందిన గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిత్ ఈ ముగ్గురు యువకులతో నిరంతరం సంప్రదింపులు జరిపాడు.
పండిత్ సూచనల మేరకు నటుడు ఏ సమయంలో ఎక్కడికి వెళ్తారనే దానిపై నిందితులు రెక్కీ నిర్వహించారు. వారాంతాల్లో ఫుట్‌బాల్ ఆడటానికి జుహూ ప్రాంతానికి వెళ్తుండటాన్ని గమనించారు. అక్కడి నుంచి వచ్చే సమయంలో ష్రాఫ్‌పై దాడి చేయడానికి కుట్ర పన్నారు. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు టైగర్ ష్రాఫ్ కారుపై ఐదు నుంచి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అదే సమయంలో ఓ నిందితుడి తుపాకీ పని చేయకపోవడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఆ ముగ్గురు నేపాల్ పారిపోతుండగా రాజస్థాన్‌లోని కోటాలో ఆగి ఉన్న రైల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

