శనివారం 06 జూన్ 2020
National - May 19, 2020 , 21:24:55

‘త్వరలో 17 వేల ఖాళీలను భర్తీ చేస్తాం..’

‘త్వరలో 17 వేల ఖాళీలను భర్తీ చేస్తాం..’

మహారాష్ట్ర: రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య శాఖలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మహారాష్ట్ర మంత్రి రాజేశ్‌ తోపే తెలిపారు. మంత్రి రాజేశ్‌ తోపే మీడియాతో మాట్లాడుతూ..వైద్యశాఖలో  ఖాళీగా ఉన్న 17వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్పెషలిస్ట్‌ డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్‌ సిబ్బందిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 67 ల్యాబ్‌ లలో ప్రతీ రోజు 15 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో మరణాల శాతం 3.2గా ఉన్నట్లు చెప్పారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo