ఎంకరేజ్: అమెరికాలోని అలస్కాలో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. అలస్కా సమీపంలోని ఎంకరేజ్కు ఈశాన్యాన ఉన్న నిక్ హిమానీనదం వద్ద హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. అతనికి తీవ్రంగా గాయాలయ్యాయని, అయితే ప్రాణానికి ఎలాంటి అపాయం లేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా, హెలికాప్టర్ గడువు ముగిసినప్పటికీ దానిని వినియోగించారని, ఈ కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు చేపట్టింది.
అయితే ఈ ప్రమాద కారణంగా నిక్ హిమానీనద ప్రాంతంలో విమానాల రాకపోకలను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సోమవారం వరకు నిషేధం విధించింది. నిక్ హిమానీ నదం అలస్కాలోని ఉత్తర చుగాచ్ పర్వతాలలో ఉన్నది. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రం. వేసవిలో హైకింగ్, బోటింగ్, విమానాలలో విహంగ వీక్షణ వంటివి జోరుగా సాగుతాయి. కాగా, ఈ హిమానీ నదం పరిసర ప్రాంతాల్లో అనేక దశాబ్దాలుగా చాలా విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్