సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్‌గివెన్ షిప్ కాస్త కదిలింది
సుయెజ్ కాలువలో ఇరుక్కొని ట్రాఫిక్ జామ్‌కు కారణమైన ఎవర్‌గివెన్ కంటైనర్ షిప్ కాస్త కదిలినట్లు ఆ కెనాల్ నిర్వహణ బృందం హెడ్ వెల్లడించారు.

కైరో: సుయెజ్ కాలువలో ఇరుక్కొని ట్రాఫిక్ జామ్‌కు కారణమైన ఎవర్‌గివెన్ కంటైనర్ షిప్ కాస్త కదిలినట్లు ఆ కెనాల్ నిర్వహణ బృందం హెడ్ వెల్లడించారు. అయితే ఈ నౌక పూర్తిగా ఎప్పుడు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తుందో మాత్రం చెప్పలేదు. 400 మీటర్ల పొడువున్న ఈ ఎవర్ గివెన్ షిప్ సుయెజ్ కాలువలో వెళ్తూ గత మంగళవారం భారీ గాలులకు మెల్లగా పక్కకు తిరిగిన విషయం తెలిసిందే. దీంతో పక్కనే ఉన్న ఇసుకలో అది కూరుకుపోయింది. దీని కారణంగా కొన్ని వందలాది నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐదు రోజులుగా ఇసుకను తవ్వడం, టగ్ బోట్ల సాయంతో నౌకను లాగడం, నెట్టడం చేస్తున్నారు. వీటి వల్ల ఆ భారీ షిప్లో కాస్త కదలిక కనిపించింది.
సుయెజ్ కాలువ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ స్థానిక టీవీతో మాట్లాడుతూ.. షిప్ కింది నుంచి నీళ్లు ప్రవహిస్తున్నట్లు చెప్పారు. ఏ సమయంలో అయినా ఆ షిప్ నీళ్లపై తేలడం ప్రారంభించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో సుమారు 15 శాతం ట్రాపిక్ ఈ సుయెజ్ కాలువ గుండానే వెళ్తుంది. ఇప్పటికే కొన్ని వందలాది షిప్‌లు ఈ ఎవర్ గివెన్ నౌక అడ్డు ఎప్పుడు తొలుగుతుందా అని ఎదురు చూస్తున్నాయి. ఈ ఎవర్ గివెన్ షిప్‌పై మొత్తం 18300 కంటైనర్లు ఉన్నాయి. నౌక బరువు చాలా ఎక్కువగా ఉండటం, దీనికి తోడు బలమైన గాలులు, అలలు నౌకను కదిలించే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.
భారీ టగ్ బోట్లు
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఈ షిప్ ముందు భాగంలో ఇప్పటికే 20 వేల టన్నుల ఇసుకను తవ్వడం విశేషం. ఈ పనులు ఇలాగే కొనసాగితే వచ్చే వారం మొదట్లోనే షిప్ కదిలే అవకాశం ఉంటుంది. నెదర్లాండ్స్‌కు చెందిన బొస్కాలిస్ సంస్థకు చెందిన భారీ టగ్ బోట్లను ఈ నౌకను నెట్టడానికి, లాగడానికి వినియోగిస్తున్నారు. ఈ ఎవర్ గివెన్ షిప్ అడ్డు తొలగించడానికి ప్రయత్నిస్తున్న విదేశీ సంస్థలకు ఈజిప్ట్ ప్రధాన మంత్రి ముస్తాఫా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 321 నౌకలు సుయెజ్ కాలువలో అటూ ఇటూ ప్రయాణించడానికి వేచి చూస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

