100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కేంద్రాన్ని నిధులు కోరాయి.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కేంద్రాన్ని నిధులు కోరాయి. కొవాగ్జిన్‌ను తయారు చేస్తున్న హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ రూ.100 కోట్లు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరగా.. అటు తమకు కూడా కొవిడ్ సురక్షా పథకం కింద నిధులు మంజూరు చేయాలని ఎస్ఐఐ కూడా అడిగింది. ప్రస్తుతం భారత్ బయోటెక్ నెలకు 40 లక్షల కొవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే కేంద్రం నియమించిన అంతర్మంత్రిత్వ కమిటీ ఒకటి కొవాగ్జిన్ ఉత్పత్తిని పరిశీలించింది. అటు పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మార్చి నెలఖరులోపు 10 కోట్ల డోసుల కొవిషీల్డ్ తయారీని పూర్తి చేయనుంది. ఆ కమిటీ సీరమ్‌ను కూడా పరిశీలించింది.
కొవిడ్ సురక్షా పథకం
ఈ కొవిడ్ సురక్షా పథకం ద్వారానే ప్రభుత్వం నుంచి అటు భారత్ బయోటెక్, ఇటు సీరమ్ ఇన్స్టిట్యూట్ నిధులు కోరుతున్నాయి. ఈ పథకం కింద వ్యాక్సిన్ తయారీదారులకు నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ సెక్రటరీ రేణు స్వరూప్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి, పరిశోధన కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గతేడాది నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఇండియాలో ప్రస్తుతం సీరమ్‌కు చెందిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను వాడుతున్నారు. ఇప్పటికే సుమారు ఆరు కోట్ల డోసులు వ్యాక్సిన్లను ఇచ్చారు. అటు కొవాగ్జిన్‌ను ముంబైలోనూ తయారు చేయడానికి టెక్నాలజీ బదిలీ కోసం ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అదే జరిగితే ముంబైలోని హఫ్‌కినేలో కొవాగ్జిన్‌ను తయారు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.154 కోట్లు అవసరమవుతాయి. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వ్యాక్సిన్లకు కూడా డిమాండ్ పెరిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బీజేపీ మహిళా నేత ముఖంపై ప్రమాదకర కెమికల్స్..!
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

