e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News బెలారస్‌లో నిరసనలు.. 170 మంది అరెస్ట్‌

బెలారస్‌లో నిరసనలు.. 170 మంది అరెస్ట్‌

బెలారస్‌లో నిరసనలు.. 170 మంది అరెస్ట్‌

మిన్స్క్: బెలారస్‌లో ఆందోళనాకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దీర్ఘకాల అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోపై తాజా ఆగ్రహం పెల్లుబుకుతున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగిన దాదాపు 170 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

పోలీసులు నిరసనకారులపై హింసాత్మక వ్యూహాలను ఉపయోగిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన చిత్రాలు, వీడియో ఫుటేజ్ చూస్తే తెలుస్తున్నది. నల్లని దుస్తులు, ముఖాలకు మాస్కులు ధరించిన పోలీసు అధికారులు ఒక వ్యక్తిని నేలమీద పడేసి నెట్టడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

మిన్స్క్‌లో జరిగిన నిరసనల సందర్భంగా 170 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారని
మానవ హక్కుల కేంద్రం వియాస్నా వెల్లడించింది. మీడియా నివేదికల ప్రకారం పెద్ద సామూహిక ప్రదర్శన కాకుండా చిన్న వికేంద్రీకృత ర్యాలీలు జరుగుతున్నాయి.

భద్రతా దళాలు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నట్లు పలువురు మీడియా ప్రతినిధులతో పాటు ఒక జర్నలిస్ట్ అసోసియేషన్ తెలిపింది. తనను కొన్ని గంటలపాటు అదుపులో ఉంచుకున్నారని డ్యూయిష్ వెల్లె కరస్పాండెంట్ నికోలస్ కొన్నోల్లిని తెలిపారు.

బెలారస్ సంక్షోభం నుంచి శాంతియుత మార్గాన్ని కనుగొనటానికి అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కింద అధికార నాయకత్వంతో చర్చలు జరుపాలని బహిష్కరణకు గురైన ప్రతిపక్ష నాయకుడు స్వెత్లానా టిఖానోవ్స్కాయ పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ ఓటింగ్ ప్లాట్‌ఫాంలపై 7,50,000 మందికి పైగా ప్రజలు ఇటువంటి చర్చలకు అనుకూలంగా ఓటు వేశారని స్వెత్లానా తెలిపారు.

2020 ఆగస్టు 9 న జరిగిన ఎన్నికల తరువాత గత ఏడాది సామూహిక నిరసనలు వెల్లువెత్తాయి. భద్రతా దళాలు దారుణంగా విరుచుకుపడినప్పటి నుంచి బెలారస్‌లో ఆందోళనలు తగ్గిపోయాయి. ఎన్నికల్లో ఓట్లను రిగ్గింగ్‌ చేయడం ద్వారా లుకాషెంకో విజయం సాధించారన్న ఆరోపణలు ఉన్నాయి. మార్చి 25 న ఫ్రీడం డే అంటూ అనేక వందల మంది వీధుల్లోకి వచ్చారు. ఆ ప్రదర్శన సందర్భంగా 200 మందికి పైగా ప్రజలను అదుపులోకి తీసుకున్నామని, నిరసనల్లో పాల్గొన్నవారిపై దర్యాప్తును ప్రారంభించామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

‘మన్‌ కి బాత్‌’ లో మన మిథాలికి మోదీ ప్రశంస

అంతా పబ్లిక్ చేయకూడదు: శరద్ పవార్‌తో భేటీపై అమిత్‌షా

లైంగికదాడి, హత్య కేసులో దోషికి మరణశిక్ష

విమానం ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నం.. పోలీసులకు అప్పగింత

ఇండోనేషియాలో బాంబు పేలుడు.. 14 మందికి గాయాలు

సప్త వర్ణాల శోభితం.. వివిధ రాష్ట్రాల్లో హోలీ కేళీ

అద్భుతమైన విజయాలకు మరో పేరు.. సైనా నెహ్వాల్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెలారస్‌లో నిరసనలు.. 170 మంది అరెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement