లైంగికదాడి, హత్య కేసులో దోషికి మరణశిక్ష
లక్నో : ఉత్తరప్రదేశ్ అజమ్గఢ్ జిల్లాలో జరిగిన లైంగికదాడి, హత్య కేసులో ఒక వ్యక్తికి స్థానిక కోర్టుమరణశిక్ష విధించింది.

లక్నో : ఉత్తరప్రదేశ్ అజమ్గఢ్ జిల్లాలో జరిగిన లైంగికదాడి, హత్య కేసులో ఒక వ్యక్తికి స్థానిక కోర్టుమరణశిక్ష విధించింది. అజమ్గఢ్ జిల్లాలోని ముబారక్పూర్ ప్రాంతంలో జరిగింది. ఈ కేసును ఛేదించడంలో, బాధితులకు న్యాయం అందడంలో విశేషంగా కృషిచేసిన పోలీసులకు, ప్రాసిక్యూషన్ బృందానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు అదనపు ముఖ్య కార్యదర్శి అవ్నిష్ కుమార్ అవస్థీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
2019 నవంబర్ నెలలో నజీరుద్దీన్ అలియాస్ పవ్వా అనే ఒక వ్యక్తి తన ఇంటికి సమీపంలోని ఒక ఇంటిలోకి ప్రవేశించి అందులో నివసిసత్తున్న మహిళను బెదిరించి ఆమెపై లైంగికదాడి జరిపాడు. అనంతరం ఆమె కుమార్తెపై కూడా లైంగికదాడికి దిగాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన సదరు మహిళ భర్త.. పవ్వాను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. వీరి మధ్య పెనుగులాట జరిగి మహిళ భర్తతోపాటు ఆమె నాలుగు నెలల చిన్నారిని కూడా చంపేశాడు. మహిళతోపాటు మరో ఇద్దరు పిల్లలపై కూడా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు నిందితుడిని పట్టుకుని కోర్టు ముందు హాజరుపర్చారు. పకడ్బందీగా కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు పవ్వాకు శిక్ష పడేలా చేయగలిగారు. దీనిపై విచారణ జరిపిన ఉత్తరప్రదేశ్ పోక్సో కోర్టు 66 పేజీల తీర్పునిచ్చింది. నజీరుద్దీన్‌ను దోషిగా తేల్చి అతడు చేసిన ఘోరమైన నేరాలకు మరణశిక్ష విధించింది. నిందితుడికి కోర్టు రూ.9 లక్షల జరిమానా విధించింది. ఈ సంఘటనను భయంకరమైన, అమానవీయమైన, అరుదైనదిగా కోర్టు పేర్కొన్నది.
ఈ ఏడాది జనవరిలో ఇలాంటి ఘటన ఒకటి యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది. సహోద్యోగి రెండేండ్ల వయసున్న కుమార్తెపై లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటనలో 30 ఏళ్ల వ్యక్తికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 అక్టోబర్ 19 న ఈ ఘటన జరిగింది. ఈ ఏడాది జనవరి 18 న ఫాస్ట్ ట్రాక్ కోర్టు సదరు వ్యక్తిని దోషిగా తేల్చింది. నిందితుల విచారణ 29 రోజుల పాటు కొనసాగింది. పోక్సో కోర్టు ఈ కేసును అరుదైనదని పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి..
విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నం.. పోలీసులకు అప్పగింత
ఇండోనేషియాలో బాంబు పేలుడు.. 14 మందికి గాయాలు
సప్త వర్ణాల శోభితం.. వివిధ రాష్ట్రాల్లో హోలీ కేళీ
అద్భుతమైన విజయాలకు మరో పేరు.. సైనా నెహ్వాల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

