ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
ధాన్యం సేకరణలో కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్‌లో రైతు వెంకటాపు రం శంకరయ్య శుక్రవారం వడ్ల కొనుగోలు కేం ద్రంలో కుప్పకూలి మృతిచెందడంతో బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
- రైతు శంకరయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
- బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
- బాధిత రైతు కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది
- మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
కొల్చారం, మే 22: ధాన్యం సేకరణలో కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్‌లో రైతు వెంకటాపు రం శంకరయ్య శుక్రవారం వడ్ల కొనుగోలు కేం ద్రంలో కుప్పకూలి మృతిచెందడంతో బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం అక్కడి నుంచి అడిషనల్ కలెక్టర్, కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. గ్రామానికి అధికారులను పంపించి శంకరయ్య వివరాలు సేకరించి, ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఆయన వడ్లు వెంటనే తూకం వేయాలన్నారు.
అనంతరం విలేకరులతో సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. శంకరయ్య మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. ధా న్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తాము మొదటి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కొల్చారం మండలంలో ముందస్తుగానే వరినాట్లు వేస్తారని, కోతలు సైతం ముందే వస్తాయన్నారు. ఈ మేరకు ఏ ర్పాట్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వరికోతలు కోసి నెల గడుస్తున్నా మండలంలో ఇంకా 50 శాతం ధాన్యం కల్లాలోనే ఉందన్నారు. రంగంపేటలో సుమా రు 15వేల క్వింటాళ్ల ధాన్యం తూకం వేసి ఉంద ని, లారీలు వస్తలేవని రైతులు చెబుతున్నారన్నారు.
కోనాపూర్, వరిగుంతం, యెనిగండ్ల, అంసాని ప ల్లి, కొంగోడు గ్రామాల్లో ఎక్క డి ధాన్యం అక్కడే మూలుగుతుందని సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ప్రభు త్వం ఎందుకు స్పందిస్తలేదని సూటిగా ఆమె ప్రశ్నించారు. లారీల కొరత తీర్చి, రైతులు అసౌకర్యానికి గురవకుండా, చివరి గింజ కొనుగోలు చేసేదాకా అధికార యంత్రాంగం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శంకరయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎమ్మె ల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు చంద్రాగౌడ్, సంతోష్ రావు, నరేందర్‌రెడ్డి, బాగారెడ్డి, రాజు, మల్లేశం, నర్సింహులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

