Akhilesh Yadav : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో మహాకుంభమేళా (Mahakumbh) వైభవంగా సాగుతోంది. దేశవిదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రోజుకు కోటి మందికి తగ్గకుండా కుంభమేళాలో పాల్గొంటున్నారు. ఇవాళ్టికి కుంభమేళా ప్రారంభమై 14 రోజులు కాగా.. 14 కోట్ల మందికి పైగా ఈ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఎంతో మంది ప్రముఖులు ఈ మహా కుంభమేళాకు తరలివస్తున్నారు.
ఇవాళ భారత్‌కు చెందిన ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ కుంభ మేళాకు హాజరయ్యారు. కుంభ మేళాలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఇవాళ కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం అఖిలేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. కుంభమేళాలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. అయితే ఈ కుంభమేళాను రాజకీయం చేయడం కరెక్టు కాదని అన్నారు. పాలకులు గొప్పలకు పోకుండా కుంభమేళాను కుంభమేళా లాగానే చూడాలని అన్నారు. కుంభమేళాకు వచ్చిన భక్తులకు ఆటలపోటీల్లో పాల్గొన్నట్లు ఉండకూడదని, అన్ని సవ్యంగా జరగాలని పేర్కొన్నారు. వృద్ధులకు సరైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
#WATCH | #MahaKumbh2025 | Samajwadi Party Chief Akhilesh Yadav takes a dip at Triveni Sangam during the ongoing Mahakumbh Mela in Prayagraj.
Source: Samajwadi Party pic.twitter.com/W8FvosRxzg
— ANI (@ANI) January 26, 2025
Women U-19 T20 WC | మహిళల అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ జోరు.. బంగ్లాపై ఘన విజయం
Tribal King | రిపబ్లిక్ డే వేడుకలకు తొలిసారి ఓ ట్రైబల్ కింగ్.. ఆ రాజు ఎవరో తెలుసా..?
BJD | రాష్ట్రస్థాయి కమిటీలన్నీ రద్దు చేసిన బిజూ జనతాదళ్.. ఎందుకంటే..!
Shubman Gill | ఒత్తిడివల్లే సరిగా ఆడలేకపోయా.. వైఫల్యంపై నిజం ఒప్పుకున్న గిల్
Republic Day 2025 | ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఆకట్టుకున్న శకటాలు.. Videos
Health tips | రోజూ ఈ గింజలు తింటే కొవ్వు ఐస్‌లా కరిగిపోతుంది తెలుసా..?