Health tips : ఈ మధ్య కాలంలో చాలామంది హై కొలెస్ట్రాల్ (High Collestrol) సమస్యను ఎదుర్కొంటున్నారు. రక్తంలో కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం (Life style), ఆహారపు అలవాట్లే (Food habits) ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బుల (Heart deseases) బారినపడే ప్రమాదం ఉంది. కొలెస్టరాల్ తగ్గడానికి కొన్ని రకాల గింజలు మేలు చేస్తాయి. వాటిలో ఫైబర్‌తోపాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆ గింజలను ఆహారంగా తీసుకోవడంవల్ల కొవ్వు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. మరి ఆ గింజలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అవిసె గింజలు (Flax seeds) గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటినే లీన్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి తోడ్పడుతాయి. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడంలో చియా విత్తనాలు కూడా దోహదపడతాయి. వీటిలో కూడా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి దోహదపడతాయి.
అదేవిధంగా జనపనార విత్తనాలను తీసుకోవడంవల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ప్రోటీన్‌తోపాటు గామా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. కొలెస్టరాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి చక్కగా పనిచేస్తాయి. గుమ్మడి గింజలు కూడా కొవ్వును తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. ఈ గింజలల్లో ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మోనో శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. నువ్వులకు కూడా కొవ్వును తగ్గించే గుణం ఉంది. వీటిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కడుపులో మంటను తగ్గించడంలో, కొవ్వును కరిగించడంలో ఇవి సాయపడతాయి.
రక్తంలో కొవ్వు సమస్యతో బాధపడేవారు పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడంవల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ ‘ఇ’ తోపాటు మోనో శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సాయపడుతాయి. నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల కూడా చెడు కొవ్వు తగ్గుతుంది. వీటితో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది.
Amit Shah | ‘యమునా నదిలో మునిగితేలు’.. కేజ్రీవాల్‌పై మండిపడ్డ అమిత్ షా
Australian Open | ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత మాడిసన్ కీస్.. ఫైనల్లో ఓడిన టాప్ సీడ్ సబలెంక
Arrest | అక్రమంగా పెయిన్ కిల్లర్స్ విక్రయం.. మణిపూర్ మహిళ అరెస్ట్
SBI Report | మహిళలకు ఉచితాలు.. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు : ఎస్బీఐ తాజా నివేదిక
Saif Ali Khan case | ‘నా కొడుకును అక్రమంగా ఇరికించారు..’ భారత మీడియా సంస్థతో సెహజాద్ తండ్రి