Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open) మహిళల ఫైనల్ (Women final) పోరులో అమెరికా టెన్నిస్ స్టార్ (Americal Tennis Star) మాడిసన్ కీస్ (Madison Keys) విజయం సాధించింది. శనివారం జరిగిన తుదిపోరులో 29 ఏళ్ల మాడిసన్ కీస్.. ప్రపంచ నెంబర్ వన్ (World number one) క్రీడాకారిణి, బెలారస్ (Belarus) టెన్నిస్ దిగ్గజం సబలెంక (Sabalenka) ను 6-3, 2-6, 7-5 తేడాతో ఓడించింది.
ఇది మాడిసన్ కీస్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో విజయం ద్వారా మాడిసన్ కీస్.. ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి కేవలం 26 ఏళ్ల వయసులోనే మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాలని భావించిన సబలెంక ఆశలపై నీళ్లు చల్లింది. సబలెంక ఖాతాలో ఇప్పటికే రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. మెల్బోర్న్ పార్క్‌లో వరుసగా 20 మ్యాచ్‌లు గెలిచిన రికార్డుకు బ్రేక్ పడటంతో సబలెంక తలపై టవల్ కప్పుకుని తన బాధను వ్యక్తం చేశారు.
1968లో ఓపెన్ ఎరా ప్రారంభమైనప్పటి నుంచి అతి ఎక్కువ వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన నాలుగో క్రీడాకారిణిగా మాడిసన్ కీస్ నిలిచింది. రేపు టోర్నీలో భాగంగా పురుషుల ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Arrest | అక్రమంగా పెయిన్ కిల్లర్స్ విక్రయం.. మణిపూర్ మహిళ అరెస్ట్
SBI Report | మహిళలకు ఉచితాలు.. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు : ఎస్బీఐ తాజా నివేదిక
Saif Ali Khan case | ‘నా కొడుకును అక్రమంగా ఇరికించారు..’ భారత మీడియా సంస్థతో సెహజాద్ తండ్రి
Crime news | రాత్రంతా పరిచయస్తుడితో బయటికి.. తెల్లారి ఇంట్లో వాళ్లు తిడతారని..!