వేములవాడ, మార్చి 13 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ దవాఖానకు వచ్చిన నిండు గర్భిణి గౌతమి పట్ల దవాఖాన నర్సింగ్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ ఘటనపై అధికారులను సంజాయిషీ కోరినట్టు తెలిసింది. విధుల్లో ఉన్న నర్సింగ్ సిబ్బంది, వైద్యాధికారులకు మెమోలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు కమిటీ వేసినట్టు వేములవాడ ఏరియా దవాఖాన నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు.