హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులకు 42% ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలుచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీ నివేదికను స్వీకరించి, జూలై 2023 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని కోరింది. టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం నాంపల్లిలోని టీజీవో భవన్లో నిర్వహించారు.
33 జిల్లాల అధ్యక్షప్రధాన కార్యదర్శులు, 76% ఫోరమ్స్ అధ్యక్షప్రధాన కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులను నెలకు రూ.700 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.