రాష్ట్రంలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో మండే ఎండలు కాస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తున్నది. మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మండే ఎండలు కాస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తున్నది. మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం భద్రాద్రి-కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో భానుడు నిప్పులు కురిపించాడు. ఆయా జిల్లాల్లో 40.4 డిగ్రీల నుంచి 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.
అదే విధంగా జగిత్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో 39.6, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో 39.5 డిగ్రీల చొప్పున నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో 37.3డిగ్రీలు నమోదయ్యాయి. శనివారం సాధారణ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరించారు. ఆదివారం నుంచి వరుసగా మూడురోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

