Arrest : అక్రమంగా పెయిన్ కిల్లర్స్ (Pain Killers) అమ్ముతున్న ఓ 30 ఏళ్ల మహిళను పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. ఆమె నుంచి పెయిన్ కిల్లర్స్, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా కోర్టు పోలీస్ కస్టడీ (Police custody) కి అప్పగించింది. పెయిన్ కిల్లర్స్ విక్రయించిన మహిళ మణిపూర్ (Manipur) వాసిగా పోలీసులు గుర్తించారు. తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లో చెన్నై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మణిపూర్‌కు చెందిన ఉంగ్లియాచింగ్ (Vungliaching) అలియాస్ రెబెక్కా (Rebekka) చెన్నైలోని తిరువాన్మియూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పెయిన్ కిల్లర్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తిరువాన్మియూర్ (Thiruvanmiyur) పోలీసులు మాటు వేసి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె మణిపూర్‌లోని కుకీ తెగ ప్రాబల్యంగల చురాచంద్పూర్ (Churachandpur) జిల్లా సింఘాట్ (Singhat) ప్రాంతానికి చెందిన మహిళగా తేలింది.
రెబెక్కాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుంచి టాపెంటడోల్ హైడ్రోక్లోరైడ్ (Tapentadol Hydrochloride) ట్యాబ్లెట్లను, రూ.1,650 నగదును, ఒక ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఆన్లైన్లో పెయిన్ కిల్లర్స్‌ను కొనుగోలు చేసి, కొరియర్ ద్వారా తెప్పించుకుని చెన్నైలో విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. అరెస్ట్ చేసిన తర్వాత రెబెక్కాను కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమెకు పోలీస్ కస్టడీ విధించింది. రెబెక్కా నుంచి మరింత సమాచారం రాబట్టడం కోసం దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.
SBI Report | మహిళలకు ఉచితాలు.. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు : ఎస్బీఐ తాజా నివేదిక
Saif Ali Khan case | ‘నా కొడుకును అక్రమంగా ఇరికించారు..’ భారత మీడియా సంస్థతో సెహజాద్ తండ్రి
Crime news | రాత్రంతా పరిచయస్తుడితో బయటికి.. తెల్లారి ఇంట్లో వాళ్లు తిడతారని..!