Amit Shah : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ (AAP convenor), ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పై కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన ఓ సభలో అమిత్ షా మాట్లాడారు. కేజ్రీవాల్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని షా విమర్శించారు.
తాము అధికారంలోకి వస్తే యమునా నదిని ఏడేళ్లలో శుభ్రం చేస్తామని, యమునా నదిని లండన్‌లోని థేన్స్ నదిలా మారుస్తానని, ఢిల్లీ ప్రజల ముందే తాను యమునా నదిలో మునకవేస్తానని గతంలో కేజ్రీవాల్ ఇచ్చిన హామీలను అమిత్ షా గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఆ హామీ నెరవేరలేదని విమర్శించారు. కేజ్రీవాల్ యమునా నదిలో ఎప్పుడు మునక వేస్తాడా అని ఢిల్లీ ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఆయన కచ్చితంగా యమునలో ప్రపంచ ప్రఖ్యాతమైన మునక వేయాలని షా డిమాండ్ చేశారు.
ఒకవేళ యమునా నదిలో మునక వేయలేకపోతే మహా కుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో మునక వేయాలని, చేసిన పాపాలను కడిగేసుకోవాలని అమిత్ షా సూచించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయిందని, కాలుష్యాన్ని అరికట్టడంతో కేజ్రీవాల్ సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందు నగరంలోని ప్రధాన సమస్యలైన నీటి కాలుష్యం, వాయు కాలుష్యం గురించి అమిత్ షా మాట్లాడటం చర్చనీయాంశమైంది.
కాగా, కేజ్రీవాల్ నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతాడని అమిత్ షా విమర్శించారు. ఢిల్లీని క్లీన్ చేస్తానని చెప్పి చేయలేదని, యమునా నదిని శుభ్రం చేయిస్తానని చేయించలేదని ఆరోపించారు. అంతేగాక తనకు ముఖ్యమంత్రిగా తనకు ప్రభుత్వ బంగ్లా అక్కర్లేదని చెప్పాడని, కానీ ఆ హామీని కూడా విస్మరించి రూ.51 కోట్లతో 50 వేల చదరపు అడుగుల శీష్ మహల్ కట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో కేజ్రీవాల్ అంత స్పష్టంగా అబద్ధాలు మాట్లాడే నాయకుడిని ఇంతవరకు చూడలేదని అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి, అర్వింద్ కేజ్రీవాల్‌కు బుద్ధి చెప్పాలని, బీజేపీని గెలిపించాలని అమిత్ షా ఓటర్లను కోరారు. బీజేపీని గెలిపిస్తే కేవలం మూడేళ్లలో యమునా నదిని శుభ్రం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Amit Shah | ‘యమునా నదిలో మునిగితేలు’.. కేజ్రీవాల్‌పై మండిపడ్డ అమిత్ షా
Australian Open | ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత మాడిసన్ కీస్.. ఫైనల్లో ఓడిన టాప్ సీడ్ సబలెంక
Arrest | అక్రమంగా పెయిన్ కిల్లర్స్ విక్రయం.. మణిపూర్ మహిళ అరెస్ట్
SBI Report | మహిళలకు ఉచితాలు.. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు : ఎస్బీఐ తాజా నివేదిక
Saif Ali Khan case | ‘నా కొడుకును అక్రమంగా ఇరికించారు..’ భారత మీడియా సంస్థతో సెహజాద్ తండ్రి