హాస్య మూవీస్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించి అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు రాజేష్ దండా. గత ఏడాది వచ్చిన హిట్ మూవీ ‘కే ర్యాంప్’ నిర్మాతల్లో రాజేష్ దండా ఒకరు. తాజాగా ఆయన ఈటీవీ విన్‌తో కలిసి తన ప్రొడక్షన్లో తొమ్మిదో చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓటీటీ ప్లాట్ఫామ్లో విజయవంతంగా మూడు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈటీవీ విన్ భాగస్వామ్యంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది.
వినూత్న కథతో నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. మా గత చిత్రాల తరహాలోనే యువత, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలుంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’ అని రాజేష్ దండా తెలిపారు.