Tribal King : భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు (Indonasia president) ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా సుబియాంతోను ఆహ్వానించడంతోపాటు దేశంలోని పలువురిని అతిథులుగా ఆహ్వానించారు. అలా ఆహ్వానాలు అందుకున్న వారిలో ఓ గిరిజన రాజు (Tribal King) కూడా ఉన్నారు. ఇంతకూ ఎవరా ట్రైబల్ కింగ్, ఏమిటి ఆయన ప్రత్యేకత తదితర వివరాలు తెలుసుకుందాం..
ఆయన పూర్తి పేరు రామన్ రాజమణ్ణన్. కేరళలో మణ్ణన్ తెగకు ఆయన రాజు. ఆదివారం భారత 76వ గణతంత్ర వేడుకలకు హాజరైన అతిథుల్లో ఆయన కూడా ఒకరు. కేంద్రం తరఫున షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఓఆర్ కేలు (OR Kelu) ఆయనను వేడుకలకు ఆహ్వానించారు. ఒక గిరిజన రాజును భారత రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
రాజమణ్ణన్ కేరళలో ఉన్న ఏకైక గిరిజన రాజు. కేంద్రం ఆహ్వానం మేరకు గత బుధవారం ఆయన తన సతీమణితో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. వచ్చే నెల 2న ఆయన కేరళకు తిరిగి వెళ్లనున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంటే ఆయన ప్రయాణ ఖర్చులను భరిస్తున్నదని మంత్రి ఓఆర్ కేలు చెప్పారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో ఓఆర్ కేలు మణ్ణన్ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. రాజమణ్ణన్ మణ్ణన్ సామాజిక వర్గానికి చెందిన 300 కుటుంబాలకు రాజుగా వ్యవహరిస్తున్నాడు. ఇడుక్కి జిల్లాలో అతను నివాసం ఉంటున్నాడు. మణ్ణన్ తెగకు చెందిన వివిధ కార్యక్రమాలు, పండుగల్లో రాజుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. రామన్ రాజమణ్ణన్ 2012లో ఆర్యన్ రాజమణ్ణన్ మరణించినప్పటి నుంచి తన తెగను పరిపాలిస్తున్నారు.
కానీ, ఒక తెగకు రాజైన రామన్ రాజమణ్ణన్ పెద్దగా ఆడంబరాలకు పోవడం లేదు. ఒక రైతుగా సాదాసీదా జీవనం గడుపుతున్నాడు. అతనికి రాజ భవనంగానీ, రథం గానీ లేవు. తన కుటుంబంతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. స్థానికంగా తెగలో ఆయనకు ప్రత్యేక హక్కులు, విధులు అంటూ ఏమీ ఉండవు. తెగ బయటివారితో తెగకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే ఆయన చూస్తుంటారు. అందుకు నలుగురు ఉపరాజులు, ఒక రాకుమారుడు, 50 మంది సభ్యుల మంత్రిమండలి తోడ్పడుతుంది.
BJD | రాష్ట్రస్థాయి కమిటీలన్నీ రద్దు చేసిన బిజూ జనతాదళ్.. ఎందుకంటే..!
Shubman Gill | ఒత్తిడివల్లే సరిగా ఆడలేకపోయా.. వైఫల్యంపై నిజం ఒప్పుకున్న గిల్
Republic Day 2025 | ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఆకట్టుకున్న శకటాలు.. Videos
Health tips | రోజూ ఈ గింజలు తింటే కొవ్వు ఐస్లా కరిగిపోతుంది తెలుసా..?