పాట్నా: ఒక బాలుడు మత్తుపదార్థాలకు బానిస అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక అతడి కుటుంబానికి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. బాలిక గొంతుకోసి హత్య చేశాడు. (Boy slits Girl’s throat) బీహార్‌లోని కతిహార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సందల్‌పూర్ గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక శనివారం అదృశ్యమైంది. ఆమె కుటుంబం వెతకగా మరునాడు పొలంలో మృతదేహం కనిపించింది. ఆ బాలిక గొంతుకోసి హత్యచేసినట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. హత్యపై దర్యాప్తు చేశారు. అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు ఆమెను చంపినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు ఆ బాలుడు మత్తుపదార్థాలకు బానిసైనట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. మత్తు పదార్థాలు సేవించే అలవాటు గురించి ఆ బాలిక అతడి కుటుంబానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆ బాలుడ్ని కుటుంబం మందలించడంతో పగ పెంచుకున్నాడు. పొలానికి వెళ్తున్న బాలిక గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. బాలనేరస్థుల న్యాయ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman kills lover | వీడియోలతో ప్రియుడు బ్లాక్మెయిల్.. చంపి ముఖంపై యాసిడ్ పోసిన ప్రియురాలు
Bengaluru techie dies by suicide | వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య
Indian crew member killed | ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. భారతీయ మెరైన్ మృతి