లక్నో: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రియుడి హత్యకు ప్రియురాలు కుట్ర పన్నింది. తన కుటుంబ సభ్యులతో కలిసి అతడ్ని హత్య చేసింది. మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు ముఖంపై యాసిడ్ పోసి కాల్చివేసింది. (Woman kills lover) యువకుడి హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అజంగఢ్‌లో నివసించే పంకజ్ గుప్తాకు పొరుగు గ్రామానికి చెందిన పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
కాగా, ఆ సంబంధాన్ని ముగించడానికి ఆ మహిళ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వీడియోలతో ఆమెను పంకజ్ బ్లాక్మెయిల్ చేశాడు. సంబంధం కొనసాగించాలని వేధించాడు. దీంతో తన అన్నా వదినలకు ఈ విషయం చెప్పింది. వారి సహాయంతో ప్రియుడ్ని అంతం చేసేందుకు కుట్ర పన్నింది.
మరోవైపు ఫిబ్రవరి 7న పెళ్లి వేడుక పేరుతో పంకజ్ గుప్తాను తన గ్రామానికి ఆ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు రప్పించారు. అంతా కలిసి అతడి గొంతునొక్కి హత్య చేశారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖంపై యాసిడ్ పోసి కాల్చివేశారు. ఆ తర్వాత పంకజ్ మృతదేహాన్ని ఒకచోట పడేశారు.
ఫిబ్రవరి 10న పంకజ్ గుప్తా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడి హత్యపై దర్యాప్తు చేశారు. తన కుటుంబంతో కలిసి ప్రియురాలు హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఆ మహిళతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Bengaluru techie dies by suicide | వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?
Watch: చాలా దూరం కారును ఈడ్చుకెళ్లిన లారీ.. షాకింగ్ వీడియో వైరల్