హైదరాబాద్, ఆట ప్రతినిధి : జాతీయ సబ్ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ శివాని కర్రా స్వర్ణంతో మెరిసింది. జైపూర్లో శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఆమె చాంపియన్గా నిలిచింది.
ఫైనల్లో శివాని 4 నిమిషాల 38.47 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి బంగారు పతకం సొంతం చేసుకుంది.