ఆసన్ (దక్షిణ కొరియా) : భారత యంగ్ షట్లర్ అష్మిత చాలిహా కొరియా మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ కెరీర్లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 26 ఏండ్ల అష్మిత 21-13, 16-21, 21-13 తో భారత్‌కే చెందిన రక్షిత శ్రీ రామ్‌రాజ్‌ను ఓడించింది. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అష్మిత ఆరంభం నుంచే దూకుడు కనబరిచి విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్, ప్రపంచ 35వ ర్యాంకర్ హాన్ జియాన్ జి (చైనా)తో తలపడనుంది.