హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ డబుల్స్ షట్లర్లు అర్జున్ రెడ్డి, అచ్యుతాదిత్య రావు అరుదైన ఘనత సాధించారు. జతకట్టిన తొమ్మిది నెలల్లోనే బీడబ్ల్యూఎఫ్ పురుషుల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-100లోకి ప్రవేశించారు. 2025 అక్టోబర్‌లో కలిసి ఆడటం ప్రారంభించిన ఈ జోడీ ఇప్పటివరకు 12 టోర్నమెంట్లలో పాల్గొని 5 పతకాలు సాధించడంతో పాటు అంతర్జాతీయ సర్క్యూట్లో అత్యంత వేగంగా ఎదిగిన ద్వయంగా నిలిచింది.
గతేడాది మెక్సికో ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ ద్వయం.. మరో మూడు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఇటీవల ముగిసిన కొరియా మాస్టర్స్ తర్వాత ఈ జంట అధికారికంగా టాప్-100లో స్థానం ఖరారు చేసుకుంది.