– ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్
రామగిరి, మార్చి 02 : బీఈడీ కోర్సులో ఫేస్ రికగ్నిషన్ హాజరు విద్యార్థులు, అధ్యాపకులకు ఖచ్చితంగా అమలు చేయాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీ పరిధిలో బీఈడీ విద్య అమలు తదిరత అంశాలపై సోమవారం ఎంజీయూ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్స్ కు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బీఈడీ విద్యలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపర్చాలన్నారు. ప్రతి సెమిస్టర్లో ఖచ్చితంగా విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలన్నారు. ఉపాధ్యా య విద్యలో ఎన్నో సంస్కరణలు వస్తున్నాయని, వాటిపై కళాశాల అధ్యాపకులు సహితం నైపుణ్యాలు పెంచుకోవాలని, డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలని సూచించారు.
అదే విధంగా ప్రతి బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్‌తో కలిపి 10 మంది అద్యాపకులు విధిగా ఉండాలని, నిత్యం బోధన సాగాలన్నారు. అన్ని కళాశాలలు ఫేస్ రికగ్నిషన్ మెషన్లు వినియోగించాలని, హాజరు లేని విద్యార్థులను పరీక్షలకు అనుమతించక పోవడంతో పాటు స్కాలర్షిప్ నిలిపివేయాలన్నారు. బీఈడీలో చాత్రోపాధ్యాయులకు టీచింగ్ ప్రాక్టిస్ కీలకమైందని, వాటికి సంబందించిన రికార్డుల నిర్వహణ, ప్రాక్టికల్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని, ఎటువంటి లోటుపాటు లేకుండా చూడాలని, తప్పులు జరిగితే కళాశాలలపై నిబంధనల మేరకు చర్యలుంటాయని హెచ్చరించారు.
కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని, ప్రస్తుతం జరిగే సెమిస్టర్ 2, 4 టీచింగ్ చాత్రోపాద్యాయుల టీచింగ్ ప్రాక్టిస్‌కు ప్రతి విద్యార్థి హాజరయ్యే విధంగా చూడాలన్నారు. టీచింగ్ ప్రాక్టిస్‌కు వెళ్లాలన్నారు. అనంతరం పలు కళాశాలల ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్స్ సందేహాలను నివృత్తి చేశారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ డా.వై. ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి, వర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొ.ఆకుల రవి. బీఈడీ కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ రాందాసు పాల్గొన్నారు.