BJD : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి (Odisha former CM) నవీన్ పట్నాయక్ (Navin Patnaik) నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (BJC) పార్టీ రాష్ట్రస్థాయి కమిటీలన్నింటిని రద్దు చేసింది. పార్టీ సంస్థాగత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేడీ ఈ చర్యకు పూనుకుంది. త్వరలో బీజేడీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ప్రతాప్ కేసరి దేవ్ (Pratap Kesari Deb) ను నియమించింది. బీజేడీ ఆయనను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించడం ఇది వరుసగా మూడోసారి.
కాగా, తనకు వరుసగా మూడోసారి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించిన నవీన్ పట్నాయక్‌కు ప్రతాప్ కేసరి దేవ్ కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదటి దశలో క్షేత్రస్థాయిలో, రెండో దశలో బ్లాక్ స్థాయిలో, మూడో దశలో జిల్లా స్థాయిలో, ఆఖరుగా రాష్ట్రస్థాయిలో పోలింగ్ జరుగుతుందని చెప్పారు.
మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగియడానికి మూడు నెలల సమయం పడుతుందని ప్రతాప్ కేసరి దేవ్ చెప్పారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం బీజేడీ రద్దు చేసిన రాష్ట్రస్థాయి కమిటీల్లో బిజూ మహిళా జనతాదళ్, బిజూ యువ జనతాదళ్, బిజూ ఛాత్ర జనతాదళ్, బిజూ శ్రామిక సాముఖ్య, లీగల్ సెల్, అప్రవాసీ సెల్ ఉన్నాయి. ఈ మేరకు బిజూ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడి పేరుతో ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది.
Shubman Gill | ఒత్తిడివల్లే సరిగా ఆడలేకపోయా.. వైఫల్యంపై నిజం ఒప్పుకున్న గిల్
Republic Day 2025 | ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఆకట్టుకున్న శకటాలు.. Videos
Health tips | రోజూ ఈ గింజలు తింటే కొవ్వు ఐస్‌లా కరిగిపోతుంది తెలుసా..?