Shubman Gill : మితిమీరిన ఒత్తిడి కారణంగానే తాను సరిగా ఆడలేకపోయానని, అసవరమైనన్ని పరుగులు చేయలేకపోయానని భారత బ్యాటర్ (Indian batter) శుభ్‌మాన్ గిల్ (Shubhman Gill) చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) లో తన వైఫల్యానికి గల కారణాలను గిల్ నిజాయితీగా ఒప్పుకున్నాడు. టెస్టు క్రికెట్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని తనపై తానే ఒత్తిడి పెట్టుకున్నానని, అందుకు తగ్గట్టుగా ఆడలేకపోవడంతో ఒత్తిడి పెరిగిపోయిందని గిల్ చెప్పాడు.
ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోవడంతో ఏకాగ్రత కోల్పోయి సరిగా ఆడలేకపోయానని గిల్ తెలిపాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన శుభ్‌మాన్ గిల్.. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యం గురించి మాట్లాడాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆరు ఇన్సింగ్స్ ఆడి.. 18.60 సగటుతో గిల్ కేవలం 93 పరగులు మాత్రమే చేశారు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
కాగా రంజీ ట్రోఫీలో పంజాబ్ ఆటగాడు అయిన శుభ్‌మాన్ గిల్ కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. అయితే ఆ సెంచరీ పంజాబ్‌ను ఇన్సింగ్స్ 207 పరుగుల ఓటమి నుంచి రక్షించకపోయినా.. గిల్ మాత్రం ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు.
Republic Day 2025 | ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఆకట్టుకున్న శకటాలు.. Videos
Health tips | రోజూ ఈ గింజలు తింటే కొవ్వు ఐస్‌లా కరిగిపోతుంది తెలుసా..?