Encounter : పోలీసులు వెంబడిస్తుంటే దుండగులు కార్లలో పారిపోతుండటం, వారిని పోలీసులు తమ వాహనాల్లో ఛేజ్ చేయడం, ఆఖరికి దుండుగులు తప్పించుకోవడమో, లేదంటే పోలీసుల చేతిలో హతమవడమో లాంటి ఘటనలను మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని షామ్లీ జిల్లా (Shamli district) లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పారిపోతున్న దుండగులను పోలీసులు ఛేజ్ చేసి కాల్చిచంపారు.
వివరాల్లోకి వెళ్తే.. గ్యాంగ్‌స్టర్ ముస్తఫా కగ్గా ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వెళ్తున్నట్లు మంగళవారం ఉదయం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో మాటువేసి ఆ దుండగులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులను పసిగట్టిన దుండుగులు కారులో తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎస్టీఎఫ్ పోలీసులు వారిని సినీ ఫక్కీలో వెంబడించారు. షామ్లీ జిల్లాలోని ఝిన్ఝనా ఏరియాలో వారి వాహనాన్ని చుట్టుముట్టారు.
దుండుగులు పోలీసులపై కాల్పులకు ప్రయత్నించడంతో పోలీసులు వెంటనే అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ ముస్తఫా ముఠాకు చెందిన అర్షద్, మంజీత్, సతీష్‌తోపాటు మరో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎన్కౌంటర్ సమయంలో దుండగులు ప్రయాణించిన వాహనాన్ని కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | 4 miscreants were killed in an encounter by Uttar Pradesh STF in the Jhinjhana area of Shamli district; an STF inspector was also injured.
Mustafa Kagga gang member Arshad along with three others- Manjeet, Satish and one unknown accomplice were injured in the encounter.… pic.twitter.com/PXj1Dhpw6f
— ANI (@ANI) January 21, 2025
Maha Kumbh | గంగమ్మ తల్లి ఆశీస్సుల కంటే నాకు ఏదీ గొప్ప కాదు : గౌతమ్ అదానీ
Gautam Adani | మహా కుంభమేళాలో భక్తుల సేవలో గౌతమ్ అదానీ.. Video
Flying Past rehearsals | గణతంత్ర వేడుకల ముందు ఢిల్లీలో ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్.. Videos
DRO Rummy Game | సమావేశంలో డీఆర్వో ఆన్లైన్ రమ్మీ గేమ్ వైరల్.. విచారణకు కలెక్టర్ ఆదేశం
Kiran Abbavaram | తండ్రి కాబోతున్న టాలీవుడ్ యువ హీరో
Spondylosis | డిస్క్‌లు జారిపోవద్దు.. జాగ్రత్త!