Kiran Abbavaram | టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) శుభవార్త చెప్పారు. తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన భార్య రహస్య గోరక్ (Rahasya Gorak) బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘మా ప్రేమ రెండడుగుల మేర పెరుగుతోంది’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు కిరణ్ అబ్బవరం-రహస్య గోరక్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Our love is growing by 2 feet 👣👼🐣 pic.twitter.com/69gL0sALaZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 21, 2025
కాగా, కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్ గతేడాది ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక తొలి సినిమాతోనే కిరణ్, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మొదట్లో స్నేహితులుగా ఉన్నా.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రూబా’. విశ్వకరుణ్ దర్శకుడు. శివమ్ సెల్యూలాయిడ్స్, సారెగమ మ్యూజిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ‘క’ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయని మేకర్స్ తెలిపారు.
Also Read..
Dil Raju | నిర్మాత దిల్ రాజు ఇండ్లు.. ఆఫీస్లపై ఐటీ దాడులు
అండర్‌వరల్డ్ ‘హాంగ్‌కాంగ్ వారియర్స్’
చెట్టుకు, మనిషికి మధ్య ప్రేమకథ