Masoud Pezeshkian: యుద్ధం ఆగాలంటే.. 3 షరతులు పెట్టిన ఇరాన్ అధ్యక్షుడు
Masoud Pezeshkian: ఇరాన్ సహజ హక్కులను గుర్తించాలని.. యుద్దం వల్ల జరిగిన నష్ట పరిహారాన్ని చెల్లించాలని.. భవిష్యత్తులో మళ్లీ దాడి చేయరన్న గ్యారెంటీ ఇవ్వాలని ఇరాన్ అధ్యక్షుడు మసోద్ పెజెష్కియాన్ తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి విరియాలంటే ఈ కండీషన్స్ తప్పవని ఆయన అన్నారు.
టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో జరుగుతున్న యుద్ధం ఆగాలంటే ఇరాన్ కొన్ని షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసోద్ పెజెష్కియాన్(Masoud Pezeshkian) దీని గురించి తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. అమెరికా కూటమితో ఎటువంటి ఒప్పందం జరిగినా.. ఇరాన్ సహజ హక్కులను గుర్తించాలని పెజెష్కియాన్ అన్నారు. రష్యా, పాకిస్థాన్ నేతలతో ఈ అంశం గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి స్థాపన జరగాలంటే కొన్ని అంశాలు కీలకమైనవని ఆయన అన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో యుద్ధం ముగియాలంటే మూడు అంశాలు ముఖ్యమైనవని పెజెష్కియాన్ తెలిపారు. ఇరాన్ హక్కుల్ని గుర్తించడం, నష్టపరిహారాన్ని చెల్లించడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి దాడులు చేయబోమనన్న గ్యారెంటీ ఇవ్వాలని ఇరాన్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.
Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way to end this war—ignited by the Zionist regime & US—is recognizing Iran’s legitimate rights, payment of reparations, and firm int’l guarantees against future aggression.
— Masoud Pezeshkian (@drpezeshkian) March 11, 2026
ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై ఆకస్మికంగా జరిపిన దాడిలో.. ఆ దేశ సుప్రీంనేత ఖమేనీతో పాటు అనేక మంది కీలక నేతలు హతమయ్యారు.అయితే ఆ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లను పేల్చివేయడంతో ఆ ప్రాంతం అగ్నిగుండంగా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

