హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు దాడులు నిర్వహించాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
దిల్ రాజు నివాసాలతోపాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి ఇండ్లలోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనే తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా పుష్ప 2 సినిమా నిర్మాత నవీన్ ఎర్నేని, మైత్రి మూవీస్ కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా, సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాల్లో దిల్ రాజ్ నిర్మించినవి రెండు చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్, వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు దిల్ రాజ్ బ్యానర్ నుంచి వచ్చినవే.