– బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ధర్నా
బూర్గంపహాడ్, మార్చి 16 : పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు, జిల్లా సమితి సభ్యుడు పేరాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు నిలిపేయాలన్నారు. యుద్ధాల వల్ల దేశంలో పెరిగిన నిత్యావసర వస్తువుల్లో భాగమైన గ్యాస్ ధరను తక్షణమే తగ్గించాలని, గ్యాస్ ధరల కారణంగా సామాన్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీటీ సమ్మయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అలవాల సీతారామిరెడ్డి, మండల నాయకులు సిద్ధారపు సుబ్బారెడ్డి, ముదిగొండ బాలకృష్ణ, బలరాం, కూరపాటి దాసు, కుంజా నాగరాజు, సింగబోయిన వెంకటేశ్వర్లు, సోయం విజయబాబు, కొమరం రాజేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.