koti Talambralu | రాయపోల్, మార్చి 16 : భద్రాచల సీతారాముల కళ్యానానికి అందించే గోటి తలంబ్రాల కార్యక్రమం కోటి తలంబ్రాల దీక్ష సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ రాంసాగర్ గ్రామంలో రామాలయం కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగింది.
శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భద్రాచలం నుండి తీసుకొచ్చిన గోటి తలంబ్రాలను హనుమాన్ దేవాలయం నుండి రామాలయం వరకు 108 కలశాలలో నింపి బాజా బజంత్రీలతో, కాషాయ జెండాలతో గ్రామ పురవీధుల గుండా భగవన్నామ స్మరణతో భారీ ర్యాలీతో రామాలయంకు చేరుకున్నారు.
భక్తులతో 3గంటల పాటు రామనామ స్మరణ చేయిస్తూ గోటితో వడ్లను ఓలిచి తలంబ్రాలుగా మార్చారు. భక్తులు అక్కడే రామకోటి రామరాజుకు అందజేశారు. నాలుగోసారి కళ్యాణానికి 3 క్వింటాళ్ల గోటి తలంబ్రాలు తెలంగాణ రాష్ట్రం నుండి అందిస్తూన్నామని రామకోటి రామరాజు తెలిపారు.
మేము భద్రాచలం వెళ్లలేక పోయినా కూడా, మేము ఓలిచే తలంబ్రాలు భద్రాచల కళ్యాణానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలమని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అదృష్టాన్ని అందించిన రామకోటి రామరాజును రామాలయం కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.



Chinmayi | వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్.. పవన్ కళ్యాణ్ విష్ చేయడంతో సింగర్ చిన్మయి తీవ్ర విమర్శలు
Akshay Kumar | తండ్రిని కోల్పోయిన బాధని గుర్తుచేసుకున్న అక్షయ్ కుమార్.. పురుషులకు కీలక సూచన