‘హిందూ, ముస్లింల ఐక్యతతో సమాజం ముందుకు’
హిందూ, ముస్లింలు ఐక్యతతో ముందుకు సాగాలని, అలాంటప్పుడే సమాజం బలంగా ముందుకు వెళ్తుందని జనసేన పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి సరికొప్పుల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం నియమ నిష్టలతో..
– జనసేన హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి నాగేశ్వర రావు
నేరేడుచర్ల, మార్చి 16 : హిందూ, ముస్లింలు ఐక్యతతో ముందుకు సాగాలని, అలాంటప్పుడే సమాజం బలంగా ముందుకు వెళ్తుందని జనసేన పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి సరికొప్పుల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక పెద్ద మసీదీలో 14వ వార్డు కౌన్సిలర్, జనసేన నాయకురాలు విజయలక్ష్మి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు. రంజాన్ మాసం అంటే ఓపిక, ప్రేమ, సహనం అన్నారు. వీటన్నింటిని పాటిస్తూ ముస్లింలు ఈ దీక్షను కొనసాగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొమ్మరాజు శ్రీను, సాయి చరణ్, అనిల్ నాయుడు, ప్రసాద్, అర్జున్, ఇబ్రహీం, గౌస్, ఇస్త్యక్, ఖాజా, అక్బర్, రహీం, ముస్లిం పెద్దలు, జన సైనికులు పాల్గొన్నారు.

‘హిందూ, ముస్లింల ఐక్యతతో సమాజం ముందుకు’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

