యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘హాంగ్‌కాంగ్ వారియర్స్’ చిత్రం ఈ నెల 24న తెలుగులో విడుదలకానుంది. లూయిస్ కూ, సమ్మోకామ్-బో-హంగ్, రిచీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్వీఆర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నది. ‘శరణార్థిగా హాంగ్కాంగ్లోకి అడుగుపెట్టిన ఓ యువకుడు తన జీవనం కోసం అక్కడి అండర్‌వరల్డ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు.
ఈ నేపథ్యంలో తన మనుగడ కోసం అతను సాగించిన పోరాటమేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. హాంగ్‌కాంగ్ సినీ చరిత్రలో వెయ్యి కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అని ఎన్వీఆర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలిపింది.