అమరావతి : అతను జిల్లాకు బాధ్యత గల అధికారి. ఒకవైపు కీలక సమావేశం జరుగుతుండగా అవి ఏమీ పట్టనట్లు ఆన్లైన్లో రమ్మీ గేమ్ (Rummy game) ఆడుతూ వీడియోకు చిక్కారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతపురం ( Anantapuram ) జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణపై (SC Classification) ఏకసభ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాల కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అనంతపురం జిల్లా :
అనంతపురం…
కీలకమైన సమావేశంలో రమ్మీ ఆడుతూ కనిపించిన డిఆర్ఓ మలోలా
కలెక్టరేట్లో ఎస్సీ వర్గీకరణ ఏకసభ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా సమావేశం
రెండు జిల్లాల కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులంతా హాజరు
కీలకమైన సమావేశంలో డిఆర్ఓ మలోల రమ్మీ ఆడుతూ గడపటంపై… pic.twitter.com/7LcCztBfrE
— Aadhan Telugu (@AadhanTelugu) January 21, 2025
అయితే సమావేశం జరుగుతుండగానే జిల్లా రెవెన్యూ అధికారి మలోలా ( DRO ) ఆన్లైన్లో రమ్మీ గేమ్ ఆడుతూ వీడియో కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో (Video) క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్ డీఆర్వోపై సీరియస్ అయ్యారు. అతడిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.