నేపాలీ గ్యాంగ్ హల్చల్
జూబ్లీహిల్స్‌లో నేపాలీ గ్యాంగ్ మరో భారీ చోరీకి పాల్పడింది. పక్కా ప్రణాళికతో ఓ సంపన్నుల బంగ్లాలో పనిమనుషులగా చేరిన భార్యాభర్తలు యజమానులు ఊరెళ్లిన సమయంలో అల్మారాలు పగలగొట్టి కోట్లాది రూపాయల విలువైన సొత్తుతో ఉడాయించారు. జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి స్కూల్ సమీపంలోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుద్‌రెడ్డి, దీపికారెడ్డి దంపతులు నివాసం ఉంటారు.
- రూ.2 కోట్ల సొత్తుతో పరార్
- జూబ్లీహిల్స్‌లో నేపాలీగ్యాంగ్ మరో చోరీ
- పనిచేస్తున్న ఇంట్లో వజ్రాభరణాలు చోరీ
బంజారాహిల్స్,మార్చి 14: జూబ్లీహిల్స్‌లో నేపాలీ గ్యాంగ్ మరో భారీ చోరీకి పాల్పడింది. పక్కా ప్రణాళికతో ఓ సంపన్నుల బంగ్లాలో పనిమనుషులగా చేరిన భార్యాభర్తలు యజమానులు ఊరెళ్లిన సమయంలో అల్మారాలు పగలగొట్టి కోట్లాది రూపాయల విలువైన సొత్తుతో ఉడాయించారు. జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి స్కూల్ సమీపంలోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుద్‌రెడ్డి, దీపికారెడ్డి దంపతులు నివాసం ఉంటారు. ఆ ఇంట్లో నేపాల్‌కు చెందిన మహేష్ షాహీ(30), అప్సర దంపతులు 45రోజుల క్రితం పనిమనుషులుగా చేరారు.
ఇంటి ఆవరణలోని సర్వెంట్ క్వార్టర్స్‌లో వారు నివాసం ఉంటున్నారు. కాగా కుటుంబసభ్యులతో కలిసి అనిరుధ్‌రెడ్డి. దీపికారెడ్డి శుక్రవారం మద్యాహ్నం ఊటీ వెళ్లారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత కట్టర్స్, రాడ్స్‌తో మహేష్ షాహీతో పాటు అతడి భార్య అప్సర యజమాని ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్రూమ్లోని అల్మారాలను పగలగొట్టి డైమండ్ నెక్లెస్‌లు, రాడో వాచ్‌లు, బంగారు ఆభరణాలను తస్కరించి అక్కడినుంచి ఉడాయించారు.
శనివారం ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషితో పాటు డ్రైవర్ అలీ ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్న విషయాన్ని గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్ సాయంతో విచారణ చేపట్టారు. చోరీ అయిన సొత్తు సుమారు 2కోట్లదాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

