Maha Kumbh : గంగమ్మ తల్లి (Maa Ganga) ఆశీస్సుల కంటే తనకు ఏదీ గొప్ప కాదని అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ (Adani Group Chairman) గౌతమ్ అదానీ (Gautam Adani) అన్నారు. కుటుంబంతో కలిసి మంగళవారం మహా కుంభమేళా (Maha Kumbh) కు వెళ్లిన ఆయన.. అక్కడ ప్రార్థనలు, ఆరతి కార్యక్రమం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మహా కుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని, అందుకు తాను ప్రధాని నరేంద్రమోదీకి (PM Narendra Modi), యూపీ సీఎం (UP CM) యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కు దేశ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
అంతకుముందు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోగానే ఆయన ఇస్కాన్ టెంపుల్ వారితో కలిసి మహా కుంభమేళాలోని ఇస్కాన్ క్యాంపులో మహా ప్రసాదం తయారీలో పాల్గొన్నారు. ఇస్కాన్ టెంపుల్ వారు కుంభమేళా కొనసాగినన్ని రోజులు భక్తులకు ఉచితంగా భోజనం అందించనున్నారు. మహా కుంభమేళాలో ఇస్కాన్, అదానీ గ్రూప్ సంయుక్తంగా భక్తులకు ఉచిత భోజనం పెట్టాలని ఈ నెల 9ననే నిర్ణయించారు. మహా కుంభమేళా ముగిసేసరికి దాదాపు 50 లక్షల మందికి ఈ జాయింట్ క్యాంపు ద్వారా భోజనం పెట్టనున్నారు.
#WATCH | Prayagraj, Uttar Pradesh: Adani Group Chairman, Gautam Adani along with his family offers prayers at Prayagraj’s Lete Hanuman Mandir.#MahaKumbh2025 pic.twitter.com/jPFHCjj29I
— ANI (@ANI) January 21, 2025
#WATCH | Prayagraj, Uttar Pradesh: Adani Group Chairman, Gautam Adani distributes food to people after offering prayers at Prayagraj’s Lete Hanuman Mandir.#MahaKumbh2025 pic.twitter.com/QAQCxSwI5X
— ANI (@ANI) January 21, 2025
Gautam Adani | మహా కుంభమేళాలో భక్తుల సేవలో గౌతమ్ అదానీ.. Video
Flying Past rehearsals | గణతంత్ర వేడుకల ముందు ఢిల్లీలో ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్.. Videos
DRO Rummy Game | సమావేశంలో డీఆర్వో ఆన్లైన్ రమ్మీ గేమ్ వైరల్.. విచారణకు కలెక్టర్ ఆదేశం
Kiran Abbavaram | తండ్రి కాబోతున్న టాలీవుడ్ యువ హీరో
Spondylosis | డిస్క్‌లు జారిపోవద్దు.. జాగ్రత్త!