Sri Lanka: ఇంధనం ఆదా కోసం.. శ్రీలంకలో ప్రతి బుధవారం పబ్లిక్ హాలీడే
Sri Lanka: ఇంధన వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది శ్రీలంక. ప్రతి బుధవారం పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీ, వర్సిటీలు, న్యాయస్థానాలకు ఈ హాలీడే వర్తించనున్నది. ఇంధనాన్ని ఆదా చేసే ఉద్దేశంతో పలు ఆసియా దేశాలు కొత్త తరహా పాలసీలు ప్రకటిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో ఇందన కొరత ఏర్పడుతోంది. హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. దాదాపు అన్ని దేశాలకు ఇంధన సెగ తగిలింది. దీంతో కొన్ని దేశాలు తమ ఇంధన పాలసీలో మార్పులు తెస్తున్నాయి. ఆసియా దేశాలు ఇంధనాన్ని ఆదా చేసే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ తన ఇంధనాన్ని సరఫరా చేయలేకపోతున్నది. ఈ నేపథ్యంలో ఏర్పడిన కొరతను తీర్చడం అసాధ్యంగా మారింది. ఆసియా దేశాలకు దాదాపు 90 శాతం ఇంధనం హోర్ముజ్ జలసంధి నుంచే అందుతుంది. ఆసియాకు ఇంధన ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాన్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. కానీ ప్రస్తుత దశలో పరిస్థితులు కఠినంగా మారడంతో.. శ్రీలంక(Sri Lanka) ఇంధన వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది.
ఇంధనాన్ని ఆదా చేయాలన్న ఉద్దేశంతో బుధవారం రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించింది శ్రీలంక. దీనితో పాటు నేషనల్ ఫ్యూయల్ పాలసీని ఆ దేశం రూపొందించింది. ఇంధనం ఖరీదుకు చెందిన ఆ పాస్ ఓ రేషన్ కార్డు తరహాలో పనిచేస్తుంది. ప్రతి ఒక్క వాహనదారుడు నేషనల్ ఫ్యూయల్ పాస్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మయన్మార్‌లో కూడా ప్రభుత్వం వాహనదారులపై ఆంక్షలు విధించింది. ప్రత్యామ్నాయ దినాల్లో వాహనాలను నడిపాలని సూచించింది. లైసెన్సు ప్లేట్ నెంబర్ల ప్రకారం ప్రత్యామ్నాయ రోజుల్లో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు.పిలిప్పీన్స్‌లో కూడా కొత్త ఆంక్షలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒక రోజు ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. హెల్త్, పోర్ట్స్, వాటర్ సర్వీసెస్, శ్రీలంక కస్టమ్స్‌కు హాలీడే వర్తించదు. కేవలం స్కూళ్లు, యూనివర్సిటీలు, జుడిషియల్ సంస్థలకు సెలవు వర్తిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

